Header Banner

నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు! కారణం ఏంటంటే!

  Sun Feb 02, 2025 09:13        Politics

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్తు్న్న ఆయన.. కాంగ్రెస్ తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ ఎన్నికలు డిసెంబర్ 5న జరుగుతాయి. అందువల్ల డిసెంబర్ 3 సాయంత్రం వరకే ప్రచారానికి టైమ్ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే ఉంది. కాంగ్రెస్ నామమాత్రంగానే ఉన్నా.. ఆ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించగలదు అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ తరపున ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళే ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ఏపీ నుంచి బయలుదేరతారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది కాబట్టి.. చంద్రబాబు.. బీజేపీ తరపున ఢిల్లీలో ప్రచారం చెయ్యబోతున్నారు. తెలుగువారు ఉన్నచోట ఈ ప్రచార ర్యాలీ సాగనుంది. ఇందుకు సంబంధించి టీడీపీ ఎంపీలు తగిన ఏర్పాట్లు చేశారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మామూలుగా అయితే సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి.. ఇద్దరి మధ్యా ఎలాంటి శత్రుత్వమూ లేదు. రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడిగా ఆయన పార్టీలోనే ఉండేవారు. ఇప్పటికీ ఆ అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ.. పూర్తి వ్యతిరేక గళం వినిపించబోతున్నారు. బద్ధశత్రువుల్లా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తరపున వీళ్ల ప్రచారం సాగుతుంది కాబట్టి.. వీరిద్దరూ భిన్నమైన వాదనల్ని ప్రచారంలో వినిపిస్తారు. 

 

ఎన్నికలకు వారం ముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరడం కలకలం రేపుతోంది. తమకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే.. తాము బీజేపీలో చేరామని వారు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ని ఓడించడానికి బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. ఐతే.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మాత్రం.. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. గెలిచిన తర్వాతే తాను తిరిగి సీఎం అవుతానని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే ఈ ఎన్నికల్ని ఆప్ చాలా సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ కూడా.. ఆప్‌ని ఓడించడం ద్వారా.. ఢిల్లీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. కింగ్ మేకర్ అవ్వాలనుకుంటోంది. ఆప్, బీజేపీల్లో దేనికీ పూర్తి మెజార్టీ రాకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఐతే.. సర్వేలు మాత్రం మెజార్టీ తగ్గినా.. మళ్లీ ఆప్ అధికారంలోకి వస్తుంది అంటున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP